Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం సందర్భంగా మాట్లాడారు. గత ఎన్నికల్లో మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని నమ్మి ఓటు వేసి గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలలోనే మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమీషా, మోడీలకు తాకట్టుపెట్టి మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చిన మోసగాడు రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. అమీషా, మోడీలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పండుతున్నారని మునుగోడు ప్రజలు ఆలోచన చేసి బిజెపి గుణపాఠం చెప్పాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజార్టితో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రావుల శ్రీనివాస్‌గౌడ్, జానీయాదవ్ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బంగారుగడ్డలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బృందం సభ్యులు జెడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు వర్కాల వెంకటేష్, సర్పంచ్ వెంకటమ్మ మధుకర్, సంగెపు గిరినేత, తదితరులు పాల్గొన్నారు.