Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
మునుగోడు నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గ స్థానానికి నవంబర్ 3 న నిర్వహించనున్న ఉపఎన్నిక పోలింగ్ రోజు ఎన్నికల నియమావళి అమలులో సూక్ష్మ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమని సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో మునుగోడు ఉపఎన్నికలో విధులు నిర్వహించడానికి నియమించిన సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగు రోజు ఎన్నికల సంఘం నియమావళిని ఎవరైనా అతిక్రమిస్తున్నారా అనే అంశాలను సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ స్టేషన్ లొకేషన్ నుండి పరిశీలించాలన్నారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహణను పరిశీలించాలని తెలిపారు. పోలింగ్ రోజున పరిశీలించిన అంశాలను వారికి ఇవ్వబడిన ఫార్మాట్లలో పూర్తి చేసి, ఆబ్జర్వర్కు అందజేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టీ.వినరు కృష్ణా రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందితో పాటు సూక్ష్మ పరిశీలకులకు పోలింగ్ రోజు రవాణకు బస్సు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుల సూచనలు దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎన్నికల శిక్షణా నోడల్ అధికారి బి.బిక్షపతి, మైక్రో అబ్జర్వర్ల నోడల్ అధికారి రాజశేఖర్, మాస్టర్ ట్రైనర్ తరాల పరమేశ్, బాలు, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.