Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మినీ స్టేడియంలో నిర్మిస్తున్న డ్రయినేజీ నిర్మాణం ఆపాలని సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యురాలు కందల ప్రమీల డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానిక మిని స్టేడియంలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేడియంలోపల నిర్మిస్తున్న పెద్ద డ్రయినేజీ వల్ల స్టేడియంకు వచ్చే వాకర్సు ఇబ్బంది పడడమే కాకుండా వ్యాధుల బారినపడే అవకాశం ఉందన్నారు. డ్రయినేజీని స్టేడియం లోపల నుండి కాకుండా రహదారి వెంబడి కోర్టు ముందు నిర్మాణం చేపడితే బాగుంటుందన్నారు. పట్టణంలోని తిప్పర్తి రోడ్డు, తాటికల్రోడ్డు, కడపర్తిరోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. అస్తవ్యస్తంగా మారిన రహదారులకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల, పట్టణ కార్యదర్శులు రాచకొండ వెంకట్‌గౌడ్, ఒంటెపాక వెంకటేశ్వర్లు, సాకుంట్ల నరసింహ, ప్రవీణ్ కుమార్, ఏర్పుల తాజేశ్వర్, సోమేష్, కృష్ణారెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.