Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పు గూడెం గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత ధూపటి వీరయ్య 77 గుండెపోటుతో శనివారం రాత్రి మరణించారు. ఆదివారం ఉదయం ఆ పార్టీ మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ వీరయ్య భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ జెండా కప్పి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని తెలిపారు. 1965లో పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీని వీడకుండా అప్పటి ఏసి రెడ్డి నరసింహారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ బుర్రకథలు, ఒగ్గు కథలు నాటకాలు ప్రదర్శించేవారన్నారు. కల్లుగీత కార్మిక సంఘంలో ముందుండి ఉద్యమం నడిపించారని తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. నివాళులర్పించిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుదగాని సత్తరాజయ్య, శర్బనాపురం గ్రామ ఉప సర్పంచ్ గడ్డమీది నరేష్, గ్రామ శాఖ కార్యదర్శిలు అందే అంజయ్య ,సిరిగిరి సారయ్య, సంఘీ రాజు, పార్టీ నాయకులు తీగల వెంకటేష్ ,మధ్య బోయిన ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ శ్రీహరి, గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు కారే రాజు, నాయకులు రమేషు, బాలరాజు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఆలేరుటౌన్ : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దూపాటి వీరయ్య మరణం తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ.ఇక్బాల్ అన్నారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వీరయ్య భౌతికకాయాన్ని ఆయన సందర్శించి జోహార్లు అర్పించారు. పీఏసీఎస్ మాజీ చైర్మెన్ మోరి గాడి చంద్రశేఖర్ తో కలిసి మాట్లాడుతూ ధూపటి వీరయ్య మరణించేంతవరకు ఎర్రజెండా సిద్ధాంతాన్ని నమ్మి ప్రజలకు సేవ చేశారన్నారు . ఈ కార్యక్రమంలో సీఐటీయూనాయకులు మొరిగాడి రమేష్ భువనగిరి గణేష్, మిట్ట శంకరయ్య, గణగాని మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.