Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ రాదు
- బీజేపీ ఓడుతుందని పెద్ద నాయకులు రావడం లేదు
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
మునుగోడులో ఎన్ని కుయుక్తులు చేసినా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమి ఖాయమైంది. ప్రజలు తమ వెంటే ఉన్నారు.అన్ని సర్వేల్లోనూ బీజేపీ మూడోస్థానంలో ఉందని మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు.మండలంలోని ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.కాంగ్రెస్ నాయకులు రోడ్లపై రన్నింగ్ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ పెద్దలు ప్రచారాన్ని కూడా రావడం లేదని విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరు సభలో స్వయంగా నియోజకవర్గాన్ని అభివద్ధి చేసే శ్రద్ధ చూపుతనని తెలిపారన్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పాత బీజేపీ క్యాడర్ ఓట్లు వేసే పరిస్థితి లేదని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని దీమా వ్యక్తం చేశారు.ప్రజలంతా టీిఆర్‌ఎస్ వెంటే ఉన్నారన్నారు.మునుగోడు ప్రాంతం వామపక్ష భావజాలానికి నిలయంగా ఉందని, మతోన్మాద పార్టీకి మునుగోడు ప్రజలు స్థానం కల్పించరని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ జాల మమత, మాజీ సర్పంచ్ జాల మల్లేశం, మునగాల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలను ఆగిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నపల్లి ముత్తిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీశైలం, రంగారెడ్డి, రాజు, శివాజీరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.