Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైక్ ర్యాలీ జయప్రదం చేయండి..
- ర్యాలీలో పాల్గొననున్న కేటీఆర్, తమ్మినేని, కూనంనేని
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడులో బీజేపీ అభ్యర్థి నోట్ల కట్టలు, మద్యం ఏరులై పారించిన బీజేపీకి ఓట్లు వేసేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మతోన్మాద శక్తులు తయారు చేస్తున్న బీజేపీకి డిపాజిట్ రాకుండా మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. నేడు చండూరు నుండి చౌటుప్పల్ మండలం వరకు సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బైక్‌కి వామపక్ష నాయకులు , ప్రజా సంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ బైక్ ర్యాలీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ర్యాలీలో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, యాసరాని శ్రీను, యాట యాదయ్య, వేముల లింగస్వామి, యాదయ్య, శీను, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ సర్పంచ్ ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం సర్పంచ్ నల్ల యాదయ్య గడపగడపకు ఎన్నికల ప్రచార నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లకి అవగాహన కల్పించారు. నవంబర్ మూడున జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో మర్రిగూడ గ్రామ ప్రజలు ఏకపక్షంగా కారు గుర్తుకు ఓటు వేసి మునుగోడులో టిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు బృందం సభ్యులు పుల్లేర సరోజ, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.