Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-మునుగోడు
బీజేపీ అధికారంలోకి వచ్చి 8ఏండ్లు గడిచిందని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బీజేపీ ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది కాబట్టే టీఆర్ఎస్ను గెలిపించీ మతోన్మాదులకు ఆడ్ధుకట్ట వేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు అన్నారు. సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని కాలువలపల్లీ, గుడాపురు, జమాస్తాన్పల్లీ, మునుగోడు తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తల్లి సంస్థ ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తున్న మోడీ సర్కార్ దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తూ దళితులు బలహీన వర్గాల బద్ధశత్రువుగా నిలిచిందన్నారు. రిజర్వేషన్లను తొలగించడమే కాక ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన 300 రేట్లు దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని చెప్పారు. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, జిల్లా అద్యక్షులు కొండేటీ శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుషరాములు, జిట్ట నగేష్, జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్, మునుగోడు మండల కార్యదర్శి వంటేపాక అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.