Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-నాంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావ దేనని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో భాగంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్లో స్థానిక రైతులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధర లభించక రైతులు ఎంతో నష్టపోయారని, వ్యవసాయం అంటే దండగా అని భావించే వారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పంట పెట్టుబడుల కోసం ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉంచడం, నూతన సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. అనేక విధాలుగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులపై భారం మోపుతుందని వివరించారు.ఈ ఎన్నికలలో ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంభం కృష్ణారెడ్డి, ఇట్టం వెంకట్‌రెడ్డి, పానగంటి వెంకన్న, ఇతర నాయకులు పాల్గొన్నారు.