Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
మతోన్మాద బీజేపీని ఓడించేందుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు.సోమవారం మండలకేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఎన్నికలను ఓటర్లపై రుద్దిందన్నారు.బీజేపీ అధికారంలోకొచ్చి ఎనిమిదేండ్లవుతున్నా ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు.4 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి అమలు చేయలేదన్నారు.కృష్ణా, గోదావరిబోర్డును ఏర్పాటు చేసి తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డకట్ట వేసిందన్నారు.ఆంధ్రా తెలంగాణ మధ్య నీటి వాటాలు పరిష్కరించకుండా రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు సృష్టించిందన్నారు. ఖమ్మంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ,కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ,ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు.మతోన్మాదబీజేపీని ఓడించి సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్,కార్యదర్శివర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి,మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసాచారి,తుమ్మల నర్సిరెడ్డి, మేకల సత్తయ్య పాల్గొన్నారు.