Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
గిరిజన యువకుడు, న్యాయ విద్యార్థి ధరావత్ నిఖిల్ మరణంపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు సుమన్నాయక్ కోరారు.సోమవారం మండలకేంద్రంలో జనసమితి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండలానికి చెందిన గిరిజన విద్యావంతుడు మరణం జరిగి నెలరోజులు కావొస్తున్నా వాస్తవాలను వెలికి తీయకపోవడం మూలంగా పలు అనుమానాలు, అపోహలకు కారణమవుతున్నాయన్నారు.ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గిరిజనవిద్యార్థులపై జరుగుతున్న దాడులు భయాందోళనలు గురిచేస్తున్నాయన్నారు.కారణాలు ఏమైనా ఒక ప్రత్యేక వర్గంపై జరుగుతున్న దాడులు సభ్యసమాజం సహించదన్నారు.ఇప్పటికైనా పోలీసులు విచారణను వేగవంతం చేసి నిఖిల్ మరణం మిస్టరీని ఛేదించాలని కోరారు.ఈ సమావేశంలో దావత్ బాబు సింగ్, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.