Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-కోదాడరూరల్
జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు.సోమవారం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య కల్యాణమండపంలో డివిజన్ పరిధిలోని ఆశా కార్యకర్తలకు సమీకత ఆరోగ్యశిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పథకాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు.వయోవద్ధులకు ప్రతి గురువారం ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో క్షయ వ్యాధికి సంబంధించిన ఉచిత పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని 30 ఏండ్లు దాటిన వారి వివరాలను విధిగా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ నిరంజన్ మాట్లాడుతూ నిరంతర ఆరోగ్య అధ్యయనం మేధస్సుకు తోడ్పడుతుందన్నారు.జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి కల్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతినెలా సమీప ఆరోగ్య కార్యకర్తల వద్ద ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలన్నారు.ప్రతి మూడు నెలలకోసారి వైద్యాధికారి వద్ద పరీక్షలు చేయించుకోవా లన్నారు. క్యాన్సర్ అనుమానిత వ్యాధిగ్రస్తులకు ఉచిత పరీక్షలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహిస్తా రన్నారు.కోదాడ,హుజూర్నగర్, సూర్యాపేటలోని ప్రత్యేక ఎన్సీడీ క్లినిక్‌లలో ప్రత్యేక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక శిక్షణాధికారి శ్రీనివాసరాజు, డాక్టర్ శైలజ, ప్రత్యేక బోధకులు వరమ్మ, సబిత, శిరోమణి, అంజయ్య, వినోద్, కుమారి, శశాంక్ పాల్గొన్నారు.