Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
భారతదేశ సమగ్రతను కాపాడడుతూ, దేశ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రాణ త్యాగం చేసిన ఇందిరాగాంధీ సేవలు మరువ లేనిదని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు అన్నారు.ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్థంతి నిర్వహించారు .ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ భారతదేశం అభివద్ధి కోసం, అన్ని జాతుల, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు.దేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా తయారుచేయడంలో ఆమె పాత్ర కీలకమైందన్నారు.ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం, దేశ సమగ్రత, సమైక్యత కాపాడడం కోసం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేపట్టాడన్నారు.ఈ యాత్ర కు ప్రజలనుండి విశేష స్పందన లభిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోతి గోపాల్‌రెడ్డి, అంజద్‌అలీ, కక్కిరేణి శ్రీనివాస్, ఆలేటి మాణిక్యం, కుంట్ల వెంకటనాగిరెడ్డి, ధరావత్ వీరన్న నాయక్, నాగులవాసు, గుగులోతు పాండు, కుందమళ్ళ శేఖర్, అక్కినేపల్లి జానయ్య, నరేందర్‌నాయుడు, తంగెళ్ళ కర్నాకర్‌రెడ్డి, పిడమర్తి మల్లయ్య, మిద్దె కిరణ్, సత్యనారాయణరెడ్డి, శివనాయక్, రవి, సైదులు, భిక్షం, రాజు, వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్:మండలపరిధిలోని గణపవరం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను సోమవారం నిర్వహించారు.ఆమె విగ్రహానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, సీతారాంరెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గణపవరం గ్రామ శాఖ అధ్యక్షులు జాబిసెట్టి నాగప్రసాద్, గణపవరం మాజీ ఎంపీటీసీ ఈర్ల అన్నపూర్ణమ్మ సీతారాంరెడ్డి, బండి చిన్నకోటయ్య, గునుగుంట్ల శ్రీనివాసరావు, పాపిశెట్టి సత్యం, బండి సత్యం, బలుకూరి దుర్గయ్య, కుక్కడపుగాంధీ, ఎస్కె.జాని, ఆత్కూరు నాగేశ్వర్రావు, శ్రీధర్‌రెడ్డి, గిరి పాల్గొన్నారు.