Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ
నవతెలంగాణ-కోదాడరూరల్
వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ అన్నారు.సోమవారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సన్మానకార్యక్రమంలో ఆమె మాట్లాడారు.వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం నుంచి దూరం చేయొద్దన్నారు.జాతీయ హెల్ప్‌లైన్ ద్వారా ఎంతోమందిని రక్షించి చేరదీశామన్నారు.మారుమూల గ్రామాల సైతం పర్యటించి వృద్ధులకు అవసరమైన సహాయం అందిస్తున్నామన్నారు.వృద్ధులకు పోషణ, సంరక్షణ, నిరాశ్రయాలకు సహకారం కోసం జాతీయ హెల్ప్‌లైన్ నెంబర్14567ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, వ్యాయామం వంటి వాటి పట్ల ఆవశ్యకతను వివరించారు.వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలన్నారు.ఈ సందర్భంగా వయోవృద్ధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత సీనియర్ సిటిజన్స్ సమైక్య కార్యవర్గ సభ్యులు రావెళ్ల సీతారామయ్య, అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, స్టేట్ అడ్వకేసి ఆఫీసర్ శ్యాంకుమార్,ప్రాజెక్ట్ ఆఫీసర్ వినోద్‌కుమార్, డాక్టర్ శ్యాంకుమార్, హనుమారెడ్డి, హమీద్‌ఖాన్,ఎర్రంశెట్టి లక్ష్మీనర్సయ్య, చిగురుపాటి వరప్రసాద్ పాల్గొన్నారు.