Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుషులంతా ఒక్కటేనన్న భావనను పెంపొందించుకోవాలి
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణశ్రీనివాస్
నవతెలంగాణ-చివ్వెంల
సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళఅన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం (పట్టణంలోని 1వ వార్డు) కుడకుడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.మనుషులంతా ఒక్కటే అనే భావన ప్రతిఒక్కరిలో ఉంటే సమాజంలో ఎవరి పట్ల వివక్షా ఉండదన్నారు. నిమ్నజాతుల పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అంబేద్కర్ జాతికి గొప్ప సందేశాన్ని అందించాలని రాజ్యాంగాన్ని రచించాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ అనేక సంక్షేమపథకాలు అందిస్తున్నాడన్నారు.దళితులు చదువును ఆయుధంగా చేసుకొని చైతన్యవంతులు కావా లన్నారు.ఎన్నో గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైనవిద్య, ఆహారాన్ని అందిస్తున్నారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, స్థానిక కౌన్సిలర్ వేములకొండ పద్మ, 4వ వార్డు కౌన్సిలర్ జాటోతు లక్ష్మీమకట్లాల్, పట్టణ ఏఎస్ఐ రాములు, వార్డెన్లు నిలమ్మ, ఇందిరా, మున్సిపల్ అధికారులు గౌస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.