Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో హోరాహోరీ
నవతెలంగాణ-నల్లగొండ
మునుగోడు ఉపఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 3న పోలింగ్ నిర్వహణ నేపథ్యంలో 24 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నాయకులు మాటల తూటాలతో రాజకీయాలను వెడెక్కించారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారం పర్వం ముగియగానే.. ప్రలోభాల పర్వం మొదలుకానుంది.
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహౌరీ..
రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి.. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకొని గులాబీ పార్టీ గెలుపు కోసం మంత్రులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు నియోజకవర్గంలో విస్తతంగా ప్రచారం చేశారు. బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పార్టీ అగ్రనేతలందరూ నియోజవర్గంలో ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఈటల, బండి సంజరు, ధర్మపురి అర్వింద్, విజయశాంతి తదితర నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న పాల్వాయి స్రవంతి గెలుపుకోసం కాంగ్రెస్ నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 3న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీలన్ని చేస్తున్న ప్రచారం చివరి దశకు చేరడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.