Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ- చిట్యాలటౌన్
మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అన్నారు. బీజేపీ వాళ్లు రాజకీయ స్వప్రయోజనం కోసం అనైతిక, అక్రమ పద్ధతులు ద్వారా తీసుకొచ్చిన ఎన్నికని చెప్పారు. వేల కోట్లకు అమ్ముడుబోయిన రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు తాను రాజీనామా చేశాననడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులకు, రైతులకు అన్యాయం చేస్తున్నదని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల పై భారం మోపుతుందన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలని చూస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, మండల కమిటీ సభ్యులు నారబోయిన శ్రీనివాసు, శిలా రాజయ్య, రుద్రారపు పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.