Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
మునుగోడు ఉపఎన్నికల్లో కాంట్రాక్టర్ల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆలోచన చేస్తుందని అందులో భాగంగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేరసారాలు కుదుర్చుకుంటుందని ప్రజలు ఇది గ్రహిస్తున్నారని ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. మునుగోడు ప్రజలంతా తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీజేపీకి డిపాజిట్ రాకుండా చేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ బృందం సభ్యులు జెడ్పిటిసి వంశీధర్ రెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ మధుకర్, గ్రామశాఖ అధ్యక్షులు వర్కాల వెంకటేష్, సంగెపూ గిరినేత, తదితరులు పాల్గొన్నారు.