Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధే మా ధ్యేయం
- రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-చౌటుప్పల్
దాడులు చేసే సంస్కృతి టీఆర్ఎస్ది కాదని, అభివృద్ధే తమ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మాట తీరు వీధిరౌడీని తలపిస్తుందన్నారు. జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఆయన మాట తీరు లేదని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోవడంతోనే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసి టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. బీజేపీ వాళ్లే దాడులు చేస్తూ మళ్లీ తమపైనే దాడులు జరిగాయని పేర్కొంటూ సానుభూతి పొందేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. మతకలహాల పేరిట కుట్రలు, దాడులకు దిగడం బీజేపీ నైజమని పేర్కొన్నారు. బండి సంజయ్ తీరు మార్చుకోకపోతే ఎలా బుద్దిచెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ తీసు కొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ఎస్కు శ్రీరామరక్ష అన్నారు.