Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య.
నవతెలంగాణ - భువనగిరి
విద్యారంగంలో అసమానతలను కేంద్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోందని, నూతన విద్యావిధానంతో మహిళలు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య అన్నారు. ఎస్ఎఫ్ఐ. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక శ్రీ గాయత్రి బాలికల జూనియర్ కళాశాల్లో ''నూతన జాతీయ ''విద్యావిధానం - ఒక పరిశీలన'' అనే అంశంపై ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి చింతల శివ అధ్యక్షతన సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ తెస్తున్న నూతన విద్యావిధానంతో మహిళ విద్యా అభివృద్ధి నష్టం జరిగి దేశంలో విద్యా అసమానతలు పెరిగే ప్రమాదముందన్నారు. ఇప్పటికే దేశంలో మహిళ అక్షరాస్యత 40శాతం ఉంటే నూతన విద్యా విధానం అమలుతో మరింత వెనక్కి వెళ్తుందన్నారు. దేశంలో మహిళ విద్యకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌చేశారు.. అసమానతలు వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, పట్టణ ఉపాధ్యక్షులు బుగ్గ ఉదరు ,కార్తీక్, రమణ అభిమన్యు,సునీల్ రమ్య,అంజలీ, మానస, విద్యార్థులు పాల్గొన్నారు.