Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల దాటిన బాధితులకు దక్కని న్యాయం
నవతెలంగాణ -వలిగొండ
వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో ఇంటి పన్నులు ,ధ్రువీకరణలు, ఇంటి అనుమతులు పేరు మార్పిడిలు ఆన్లైన్ ఆప్లయ్్ి పేరుతో ప్రజలను మోసగించి 20 లక్షల పైగా అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి పై నెల దాటిన ఇలాంటి చర్యలు తీసుకోకపోగా బాధితులకు న్యాయం చేయలేదని సీపీఐ(ఎం) నాయకులు విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బాధితుల పక్షాన గ్రామపంచాయతీ పాలకవర్గ సమక్షంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగాఆ పార్టీ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామచందర్, కూర శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై నిధుల దుర్వినియోగంపై విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశామన్నారు. జిల్లా పంచాయతీ అధికారిని దష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంపీడీవోకు స్థానిక ఎస్సై కి బాధితులకు న్యాయం చేయాలని వినతి అందజేసినట్టు తెలిపారు. చివరకు గ్రామపంచాయతీలో పాలకోర్గ సమక్షంలో కూడా న్యాయం చేయాలని కోరినట్లు తెలిపామన్నారు. ఇప్పటివరకు సస్పెండ్ అయిన కార్యదర్శి పై కనీస చర్య కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు బాధితులు తాము మోసపోయామని నెత్తినూరు కొట్టుకున్న విచారణ నిర్వహించగా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఒకసారి కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి విచారణ నిర్వహించాలని కోరతామన్నారు. న్యాయం జరగకపోతే పంచాయతీరాజ్ కమిషనర్‌ను లోకాయుక్తను అశ్రయిస్తామని హెచ్చరించారు.