Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊహ కొండంతా... అందింది గోరంత
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
'అనుకున్నదొక్కటి..అయినది మరొక్కటి.. బోళ్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట''అన్న పాటను ఓటరులు పాడుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు,వారి అనుయాయులు ఓటర్లను అనేక భ్రమల్లో ముంచారు. ఓటరుకు భారీ ఎత్తున డబ్బులు అందజేస్తామని ప్రచారం చేశారు. మా అభ్యర్థి ఓటుకు తులం బంగారం ఇస్తారని ఒకరు, మా అభ్యర్థి ఓటుకు 20వేల నుంచి 40వేలు ఇస్తారని మరొకరు,వారి కంటే మా అభ్యర్థి ఇంకో వెయ్యి ఎక్కువనే ఇస్తారని ఇంకొకరు ఎవ్వరికి వారు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. దీంతో ఓటర్లు అంతులేని ఆశకు ప్రధాన పార్టీలే ఓటర్లకు లేనిపోని ఆశలు కల్పించారు. తీరా ఎన్నికలు రెండు రోజులు ఉన్నాయన్నంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో ఓటర్లు ఆశించిన మేరకు అందజేయలేదని తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రచారం కొండంత అయితే వారికి ఇచ్చింది గోరంత అని ఓటర్లు వాపోతున్నారు. దీంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు నువ్వా నేనా అంటూ ఢకొీంటున్న టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లకు ఎవరు ఎక్కువ కాకుండా ఎవరు తక్కువ కాకుండా సమానంగా ఓటర్లకు అతి తక్కువ మొత్తంలో ఓటు విలువ కట్టినట్టు తెలుస్తుంది. దీంతో అవాక్కైన ఓటర్లు డబ్బులు ఇవ్వని అభ్యర్థులకు ఓటు బదిలీ చేసేందుకు సిద్ధతున్నట్టు తెలుస్తుంది.