Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద చాయ్ పే చర్చా
- వామపక్షాల అడ్డాలో బీజేపీ గెలుపు సునాయసం కాదంటున్న కార్యకర్తలు
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలుపు తధ్యమని హైదరాబాద్ ,నాంపల్లిలోని రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబీషన్ కార్యాలయం ముందుగల బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు టీ స్టాల్స్, హోటళ్ల వద్ద చాయ్ పే చర్చా మంగళవారం నిర్వహించారు. అందుకు వామపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), సీపీిఐ చౌటుప్పల్, సంస్థాన్ నరాయణపురం ,చండూరు ,మునుగోడు మండలాలలో పార్టీ మొదటి నుండి గట్టి పట్టు ఉండడం ప్రధాన కారణంగా మారింది .చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్మెన్‌్ పదవి టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడంలో గతంలో సీపీఐ(ఎం) ముఖ్య ప్రధాన భూమిక పోషించిన సంగతి గుర్తు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి,శాసన సభ్యత్వానికి మునుగోడు అభివృద్ధిలో కుంటుపడిందన్న సాకు చూపి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్ల సుముఖంగా ప్రజలు లేరని చర్చించుకున్నారు. దుబ్బాక ,హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలలో ఆ నియోజకవర్గాల పరిస్థితి వేరని,ఆ పరిస్థితులు ప్రస్తుతం కనబడడం లేదని, కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజలను తమవైపు తిప్పుకోలేకపోయారని అంశాలు ప్రస్తావనకు రావడం కొసమెరుపు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు , రాష్ట్ర కమిటీ సభ్యులు ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ , మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత ,మాజీ మంత్రి దళిత చైర్మన్ మోత్కుపల్లి నర్సింహులు ,సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లా కార్యదర్శులు ఎండి.జహంగీర్ , ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్లుఉ మల్లు లక్ష్మి ,ఉమ్మడి నల్లగొండ జిల్లాల కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు, ముఖ్య నేతలు మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ గట్టిపట్టుతో ప్రచారం నిర్వహించారని ,రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు బీజేపీ గెలుపునకు ఆటంకంగా మారాయని బీజేపీ కార్యకర్తలు చర్చించుకోవడం విశేషం. హైదరాబాద్‌లో మునుగోడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఓటరు నిజాయితీకి, బాధ్యతకు గుర్తింపుగా మునుగోడు ఓటరు నిలవాలని, మతతత్వ బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇటీవల చండూరు మండలం బంగారిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్‌షా నిర్వహించాల్సిన సభ వాయిదా పడడంతో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఇది జీర్ణించుకోలేని బీజేపీలోని కొందరు మునుగోడు నియోజకవర్గంలో అల్లర్లకు సైతం వెనుకడుగు వేయకుండా వ్యూహరచన చేసినట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజాయితీ నిబద్దతకి స్వార్థ రాజకీయా లకు మధ్య పోటీ జరుగుతోందని , యావత్ భారత దేశం నేడు మునుగోడు ఉప ఎన్నికల వైపు చూస్తుందని ప్రతి ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది .మునుగోడు ఓటరు, ఓటుకు డబ్బులు పంచి గెలుపు
ఎలాగైనా కైవసం చేసుకుందామని బీజేపీ కుట్రలు సాగవని, అందుకు పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో డబ్బులు పట్టడం పట్టుబడడమే నిదర్శనమంటున్నారు . మునుగోడు ఓటరు ధర భారీగా పెరుగుతుందని , మునుగోడు ఓటరుకు నిజాయితీ నిబద్దత ఉందని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని , ఓటరు నిజాయితీ పై ప్రజాస్వామ్యం పరిరక్షణ ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం , ప్రజల కోసం అందుబాటులో ఉండే ప్రభుత్వాలను ఎన్నుకొనే బాధ్యత ఓటరులపై ఉంది.ఓటరు నిజాయితీకి గుర్తుగా మునుగోడు ఎన్నికలు , ఓటు హక్కు వినియోగం జరగాలి.