Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
వాహనాల ద్వారా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్సై సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఖమ్మం- శాంతినగర్ ప్రధాన రహదారిపై ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు భారీ వాహనాల్లో అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారని ఇలాంటి చర్యలను అరికట్టేందుకు ఆకస్మికంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నా మన్నారు.కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రతి ఒక్కరూ సరైన పత్రాలతో నియమ నిబంధనలతో వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహన దారులు ప్రధానంగా హెల్మెట్ ధరించాలని కోరారు.రోడ్డు నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.