Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రస్థాయిలో ప్ర్రథమ బహుమతి పొందడం అభినందనీయం
- రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గండూరి ప్రకాష్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర స్థాయిలో జరిగిన జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్వాలీబాల్ చాంపియన్ షిప్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్ మహిళల జట్టు ప్రథమస్థానం సాధించడం వారి సమిష్టికృషికి నిదర్శనమని రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గండూరి ప్రకాష్ అన్నారు.క్రీడా జట్టు విజయం సాధించిన సందర్భంగా మంగళవారం స్థానిక తన నివాసంలో క్రీడాకారులను ఆయన అభినందించి మాట్లాడారు.గత నెల 28-31వ తేదీలలో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన పోటీలో వరంగల్ జట్టుపై తమ జట్టు విజయం సాధించిందని తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన వాలీబాల్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ చాంపియనిషిప్ -2022 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్ గర్ల్స్ జట్టు జయకేతనం ఎగరవేయడం ఉమ్మడి జిల్లాకు గర్వకారణమన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా వారి విజయానికి కషి చేసిన క్రీడాకారుల తల్లిదండ్రులకు, విజయానికి అహర్నిషలు శ్రమించి వారికి మెళకువలు నేర్పిన వ్యాయామ ఉపాధ్యా యులకు,అసోసియేషన్‌కు సహకరించిన కోచ్‌లకు, మేనేజర్లకు,సెలక్షన్కమిటీని అభినందిం చారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆకుల లవకుశ,వల్దాస్ జాని, బొల్లేపల్లి బ్రహ్మయ్య, సోమ్మన్న, సత్యనారాయణ, సీతారాంరెడ్డి, బ్రహ్మరెడ్డి, రవీందర్‌రెడ్డి, రవి,అశోక్,ఉబ్బని రత్నయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, మీసాల శ్రీను, దాసరి మైసయ్య, లోడంగి సైదులు, వెంకటష్, జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కోచ్ లావణ్య,ఉమ్మడి నల్గొండ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వహణ కార్యదర్శి మందడి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.