Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో రైతు వ్యతిరేక నల్లచట్టాలను తీసుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి పిలుపు నిచ్చారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.రాష్ట్రంలో ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగా బీజేపీ రాజగోపాల్‌రెడ్డికి రూ.వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి ఉపఎన్నికను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఆర్థికభారం మోపిందన్నారు.ఒకపక్క రైతు పండించిన పంట చేతికొచ్చే దశలో వర్షాలు కురుస్తున్నా ఎక్కడికక్కడ ఐఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం విచారకరమన్నారు.వ్యవసాయం చేసే రైతు మోటార్లకు మీటర్లు పెట్టి వ్యవసాయాన్ని దండగా అని చెప్పేందుకు బీజేపీ యత్నిస్తుందని విమర్శించారు.దేశానికి అన్నం పెట్టే రైతులని సున్నం పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు.రాష్ట్రం నుండి బీజేపీని తరిమికొట్టాలని కోరారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కందాల శంకర్‌రెడ్డి, దేవర వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా, గుర్రం గోపాల్‌రెడ్డి, బొమ్మిరెడ్డి గోపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.