Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
విద్యార్థులు పట్టుదలతో చదివి,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంఈఓ బోయిని లింగయ్య అన్నారు.మంగళవారం మండలంలోని వెంపటి ప్రాథమిక ప్రభుత్వపాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 350 మంది విద్యార్థులకు మణికంఠ బుక్‌స్టాల్ యజమాని తొట్ల సుధాకర్,వెంపటి గ్రామానికి చెందిన చిర్ర దిలీప్, మోడల్‌స్కూల్ ఉపాధ్యాయులు నాగుల గణేష్ ల సహకారంతో రూ.20 వేల విలువ గల టై,బెల్ట్‌లతో పాటు,ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత యూనిఫామ్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం దాతలు ముందుకు రావడం హర్షించదగ్గవిషయమన్నారు.దాతలను ఎంఈఓ, సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణగౌడ్, ఉపాధ్యాయ బృందం అభిందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట్రామనర్సమ్మ, పాఠశాల చైర్మెన్ పుల్లూరు అంబేద్కర్, ఉపసర్పంచ్ భాషబోయిన వెంకన్న,ఉపాధ్యాయులు శ్రీనివాస్,జ్యోతి, రవీందర్, గుండ్ల ఆంజనేయులు, రమాదేవి, స్వాతి, మంజుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.నందించారు.