Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రానికి చెందిన గిరిజన యువకుడు ధరావత్ నిఖిల్ మృతిపై వెంటనే సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక ఖమ్మంక్రాస్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిఖిల్‌నాయక్ కుటుంబసభ్యులు శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు.దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.పట్టణానికి చెందిన గిరిజన విద్యావంతుడు హత్యకు గురై 24 రోజులు గడుస్తున్నా వాస్తవాలను వెలికి తీయకపోవడం పలు అనుమానాలు, అపోహలకు తావిస్తుందని విమర్శించారు.ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గిరిజన విద్యార్థులపై జరుగుతున్న దాడులు భయాందోళనలు గురిచేస్తున్నాయని తెలిపారు.ఒక ప్రత్యేక వర్గంపై జరుగుతున్న దాడులను సభ్యసమాజం సహించదన్నారు.ఇప్పటికైనా పోలీసులు విచారణ వేగవంతం చేసి నిఖిల్ మరణం మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సంఘం జిల్లా ఇన్చార్జి ధరావత్ వీరన్ననాయక్, జిల్లా అధ్యక్షులు బాబునాయక్, రాష్ట్ర నాయకులు రాజేష్‌నాయక్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ గిరిజనసంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్‌నాయక్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి, పట్నం జిల్లా కన్వీనర్ విజయనర్సింహారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్, రైతుసంఘం జిల్లా నాయకులు కందాల శంకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గోపిరెడ్డి, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు చినపంగినర్సయ్య, కొండవీటి రాములు,సీఐటీయూ టౌన్ కన్వీనర్ మామిడి సుందరయ్య, గిరిజనసంఘాల నాయకులు వెంకటేష్‌నాయక్, నాగేందర్‌నాయక్, జితేందర్‌నాయక్,నాగునాయక్, శ్రీరామ్‌నాయక్, వీరన్ననాయక్, టీవీవీ జిల్లా కార్యదర్శి గుండాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.