Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-చివ్వెంల
రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో అరుగాలం కష్టించి పండించిన పంటలపై వరుణదేవుడు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాడు.పంట పండించి అమ్ముకోవడానికి కొనుగోలుకేంద్రానికి తెచ్చిన రైతుకు నిరాశే మిగిలింది.అకాల వర్షానికి కల్లాలలో, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.దీంతో రైతన్నల ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. మంగళవారం మండలవ్యాప్తంగా కురిసిన అకాలవర్షంతో కల్లాలో ఉన్న ధాన్యం సుమారు 100 క్వింటాళ్ల వరకు తడిసింది.తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమంటున్నారు.అకాల వర్షానికి రోడ్లపై అరబోసిన వడ్లు నీటి పాలు కాగా, ఆలస్యంగా నాట్లు వేసిన వరి పంట కోత దశలో ఉండడంతో వర్షానికి వడ్లు నేల పాలయ్యాయి.వరిపంట 50 ఎకరాల్లో దెబ్బతిన్నది.రూ.వేలు వెచ్చించి వరిపంట సాగు చేస్తే తీర చేతికొచ్చే సమయానికి వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో వర్షంలో తడిసిన వడ్లను చూసిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది.