Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతరోజు దీక్షలు పూర్తి..
- సర్వజనుల సమైక్యతో సాధిస్తాం..
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల కేంద్రంగా ఏర్పాటుకు భౌతికంగా, ఆ ర్థిక వనరులు ఉన్నా అమ్మనబోలు గ్రామాన్ని మరో 13 గ్రామపంచాయతీ లతో కలిపి మండల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలు మంగళవారం వందో రోజుకు చేరుకున్నాయి. సబ్బండ వర్గాల మద్దతు ప్రజాప్రతినిధుల హామీలు వీరి ఉద్యమానికి ఊపిరి పోస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు రాష్ట్రంలో నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటైన తరహాలోనే అమ్మను బోలును సైతం మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారని ఆశాభావం కొనసాగుతుంది.
14 గ్రామ పంచాయతీలతో నల్లగొండ జిల్లాలోనే కొనసాగే హామీ
నార్కట్పల్లి మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మనబోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ నల్లగొండ జిల్లాలోని కొనసాగే విధంగా ఇప్పటికే జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చినట్లు ఆయా గ్రామ పంచాయతీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
శతరోజు దీక్షలు పూర్తి..
ప్రతి చిన్న సమస్యకు పరిష్కారానికి మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని మండల కేంద్రం 20 కిలోమీటర్ల దూరం ఉందని వెంటనే అమ్మనవోలు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలు 100 రోజులు పూర్తి చేసుకున్నాయి ఈ దీక్షలకు ఇప్పటికే అధికార పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నకరికల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజరు ఉపాధ్యాయ సంఘాలు కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ సిపిఐ సిపిఎం లతోపాటు మండల సర్వసభ్య సమావేశంలో అమ్మనబోలు ను మండల కేంద్రం ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
సర్వజనుల సమైక్యతో మండలంసాధిస్తాం..
బద్దం రాంరెడ్డి (సాధన సమితి చైర్మెన్)
నార్కట్ పల్లి మండలంలోని అమ్మనబోలు, నక్కలపల్లి, పల్లెపహాడ్ బెండల్ పహాడ్ , బాజ కుంట., రామన్నపేట మండలంలోని కుంకుడు పాముల ,ఎన్నారం ,బాచుప్పల ,సూరారం, తుర్కపల్లి, శాలిగౌరారం మండలం లో నీ ఉప్పలంచ రామంజ పురం భైరవుని బండ, గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజల ఐక్యతతో, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే గా దరి కిషోర్, సహకారంతో మంత్రి జగదీశ్ రెడ్డి సారథ్యంలో అమ్మనుబోలు మండలాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటివరకు వంద రోజులు దీక్షలు చేశాం మండలాన్ని. సాధించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మనబోలును నూతన మండలం చేస్తుందని నమ్మకం ఉంది
బద్దం వరలక్ష్మి రాంరెడ్డి (గ్రామ సర్పంచ్)
పరిపాలన స్వలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు ఇప్పటికే నూతన జిల్లాలను మండలాలను గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అది తరహాలో మండల కేంద్రానికి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న అమ్మనబోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారని నమ్మకం ఉంది.
పోరాటం ఉద్ధృతం చేస్తాం...
కొంపెల్లి సైదులు (ఎంపీటీసీ)
అన్ని అర్హతలు ఉన్న అమ్మనుబోలు గ్రామాన్ని 14 గ్రామ పంచాయతీలతో కలిసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంగా ప్రకటించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని అమ్మనుబోలు ఎంపీటీసీ కొంపల్లి సైదులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే 14 గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో శాంతియుతంగా సమ్మె కొనసాగిందని వంద రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనియం అన్నారు.