Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న నిర్మాణాలను యజమానులే స్వతహాగా, త్వరగా తొలగించి నల్లగొండ పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణచారి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని దేవరకొండరోడ్లో గల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ రోడ్డులో తొలగించాల్సిన 36 నిర్మాణాలలో సగం ఇప్పటికే తొలగించారని, ఒకటి, రెండు కోర్టులో కేసులు ఉన్నాయని, మిగతా నిర్మాణాలను యజమానులు త్వరగా తొలగించాలన్నారు.
భవన నిర్మాణ పనుల పరిశీలన..
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అర్బన్ హోమ్ లెస్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 25వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈలు అశోక్, వెంకన్న, నరసింహారెడ్డి, ఏఈ రవీందర్, ఏసిపి నాగిరెడ్డి, ప్రసాద్, ఖాదర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ముర్తుజా, ఎన్ హెచ్ ఏఈ మురళి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.