Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తుల కదలికలను కనిపెట్టేందుకు 45 పోలీసు, 37 రెవెన్యూ బృందాలు ఏర్పాటు
- సీఈవో వికాస్‌రాజ్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్, నల్లగొండ పట్టణంలోని ఆర్జీల బావిలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రము, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాయంత్రం 6:00 గంటలకు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇతర డిజిటల్ ఛానెల్‌ల వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రచారం చేయడానికి కూడా నిబంధనలు ఒప్పుకోవని, సైలెంట్ పీరియడ్ ప్రారంభమైనప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత బల్క్ షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్)ఫోన్ ద్వారా ఆటోమేటెడ్ క్యాంపెయిన్ చేయడం కూడా నిషేధించబడిందని పేర్కొన్నారు. మోడల్ కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని సీఈఓ హెచ్చరించారు. సత్వర స్పందన, స్ట్రైకింగ్ ఫోర్స్, సెక్టార్ బృందాలు, పోలింగ్ స్టేషన్ భద్రతను పర్యవేక్షించడానికి, నిర్ధారించడానికి వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మునుగోడులో నమోదైన ఓటర్లు కాకుండా అనధికార వ్యక్తులందరూ వెళ్లిపోవాలని సీఈవో సూచించారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తుల కదలికలను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించినట్లు తెలిపారు. ఈ బృందాలు మంగళవారం, బుధవారం రాత్రి గ్రామాల్లో పర్యటించి అనధికార వ్యక్తుల ప్రక్షాళనతో పాటు నగదు పంపిణీ, ఇతర ప్రేరేపణలను పర్యవేక్షిస్తారని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారితో సమీక్షా సమావేశం నిర్వహించి పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలీసు బందోబస్తు తదితర విషయాలపై కలెక్టర్‌తో చర్చించారు. మునుగోడు నియోజకవర్గం లోని పలు పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. చండూరు మండల కేంద్రంలోని డాన్‌బాస్కో జూనియర్ కళాశాల ఆవరణలో పంపిణీ కేంద్రం ఏర్పాటు, ఏఎంసి, కోటాయిగూడెంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టీ. వినరుకృష్ణారెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్ఓ రోహిత్ సింగ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.