Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కార్మికులకు కనీసం ఉపాధి లేకుండా ఉండాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. చట్టాలను రద్దు చేసేంతవరకు బలమైన పోరాటాలు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా నాయకులు బిఎం.నాయుడు, అధ్యక్షులు మందరాజు, నాయకులు నాగుల్ మీరా, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.