Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రణరంగంతో వేడెక్కిన మునుగోడు
- రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు
- చౌటుప్పల్లో దివిస్ ఆఫీసులో సోదాలు
నవతెలంగాణ- మిర్యాలగూడ
40 రోజులుగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు విసృత ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించారు. వాపక్షాల ఆధ్వర్యంలో చండూరులో భారీ.. బహిరంగ సభ నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు విస్తృత ప్రచారం చేశారు.. ఆ ఇద్దరి నేతలు నియోజవర్గంలోని అన్ని మండలాల్లోనూ తిరుగుతూ క్యాడర్ణు ఉత్తేజ పరిచారు. బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఆయా సభలో పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు అంతకుముందు ఆ నియోజకవర్గంలో కేంద్ర హోం మంత్రి అమీషా బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్ని మండలాల్లోనూ తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ అన్ని మండలాలో ప్రచారం చేశారు. బీఎస్పీ తరఫున ఆ పార్టీ చీప్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం చేసి ఓట్లను అభ్యర్థించారు. చివరోజైనా మంగళవారం చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించి బీజేపీపై ధ్వజమెత్తారు. ఆ గట్టున ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ పార్టీ ఉందని, ఈ గట్టున ప్రజా సంక్షేమం చేస్తున్న కేసీఆర్ ఉన్నాడని పేదల పక్షాన నిలబడ్డ కేసీఆర్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో అశేష జనావాహిని హాజరుకాగా కేటీఆర్ ఉత్తేజ ప్రసంగాన్ని చేశారు. చండూరులో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు ఆ పార్టీ చీప్ రేవంత్ రెడ్డి హాజరై ఆడబిడ్డగా గౌరవించి గెలిపించాలని కోరారు. చౌటుప్పల్ లోని దివిస్ ఆఫీస్లో అధికారులు సోమవారం రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
రణరంగంగా మారిన పలివేల గ్రామం
మునుగోడు మండలం పలివెల గ్రామంలో టీఆర్ఎస్పై బీజేపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో టీిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో పాటు జెడ్పీచైర్మెన్ జగదీశ్లకు గాయాలయ్యాయి. అదేవిదంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాహనం ధ్వంసమైంది. ఆయన వ్యక్తిగత సహాయకుడికి గాయాలయ్యాయి. పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండటం పోలీసులు తక్కువ మంది ఉండడం వల్ల ఘర్షణను ఆపలేకపోయారు. దీంతో ఆ గ్రామం రణరంగంగా మారింది.. దీంతో నియోజవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.