Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, అమిత్‌షా ఆటలు సాగవు..
- మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనలేరు..
- టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి
- ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నాంపల్లి
వేలకోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం మునుగోడు ఉపఎన్నిక చివరి రోజు ప్రచారంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరోసిస్‌తో ఎంతో ఇబ్బందిపడిన ఈ ప్రాంత ప్రజలను మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నదీ జలాలను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అందరూ నడవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్యుల జీవితాలను ఛిద్రం చేసిన బీజేపీని ఓడించాలన్నారు. బోర్ బావులకు మిటార్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి లెటర్ పంపారని, అన్నదాతలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయనతో పాటుగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, ఇట్టం వెంకట్‌రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, పానగంటి వెంకన్న, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మర్రిగూడలో...
తెలంగాణలో అమీషా, మోడీల ఆటలు ఏమాత్రం సాగవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలో రాజాపేట తండా గ్రామంలో ఎన్నికల చివరి రోజులో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే దురాలోచనలో మోడీ సర్కారు ఆలోచిస్తుందని, అందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతుందని, ఇది వారి పతనానికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీ మతోన్మాద పారీ ్టఅని, 8 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం చేసింది ఏం లేదన్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలం ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, సర్పంచ్ నల్ల యాదయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
చండూరులో...
మునుగోడు ప్రజల ఓట్లు కొట్ట రేమో గాని.. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనరేలేరని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అంగడి పెట, చండూరులో రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి గెలిచి మూడున్నర సంవత్సర కాలంలో ఏమి అభివృద్ధి చేయకుండా ఎందుకు రాజీనామా చేశారో మీకు తెలుసా అని ఓటర్లను అడిగారు. ఆయన కేవలం అభివృద్ధి కాకుండా తన స్వలభాల కోసం కాంట్రాక్టర్ల కోసం రాజీనామా చేసి 18 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఘనుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. మళ్లీ మీ ముందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు, ఈ నియోజకవర్గానికి ఏమి ఉద్ధరించాడో సమాధానం చెప్పి ఓట్లు అడగాలన్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు గాబర్ గాబరా కాకుండా, కారు గుర్తులు పోలిన, రోడ్ రోలర్, రొట్టెల పిటి, గుర్తులు కొన్ని ఉన్నాయని ఆలోచించి రెండవ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. 30 పడకల ఆసుపత్రి, మోడల్ స్కూల్, డబల్ రోడ్డు బటర్‌ఫ్లై లైట్స్, ఇలా కొన్ని అభివృద్ధి పనులు ఈ నెలాఖరులో వచ్చి త్వరలో అమలు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు వినరు భాస్కర్‌రెడ్డ్డి, బల్క సుమన్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, కోన్‌రెడ్డి యాదయ్య, అన్నపర్తి శేఖర్, చిలుకూరి రాధిక శ్రీనివాస్, గుర్రం వెంకటరెడ్డి పాల్గొన్నారు.