Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్ రెడ్డి కి మూడో స్థానమే
- రాష్ట్ర మంత్రి చామాకురి మల్లారెడ్డి
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు ఖాయం అయింది. టిఆర్ఎస్ గెలుస్తుందని ప్రజల్లో విశ్వాసం పెరగడంతో బిజెపి నాయకుల్లో గుబులు పుడుతుందని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, రెడ్డిబాయి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ బిజెపి నాయకులు ఓటమి పాలవుతామని అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లోని ప్రజలంతా టిఆర్ఎస్ వెంట ఉన్నారని తెలిసి కుట్రలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతమంది గూండాలను వెంట బెట్టుకొని టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.గ్రామాల్లో ప్రజలు రాజగోపాల్ రెడ్డి నీ అమ్ముడు పోయావని నిలదీస్తున్నారు.ఓటమి తప్పదని భావించి జీర్ణించుకోలేక గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3న ప్రజలు నిర్భయంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునుగాల ప్రభాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ జాల మమత,మాజీ సర్పంచ్ జాల మల్లేశం,నాయకులు కొలను ఆగిరెడ్డీ, ముత్తిరెడ్డి, అనంతుల మల్లేష్, నందగిరి శ్యాం, వెంకటేష్,ప్రభాకర్ రెడ్డి,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.