Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-చండూరు
మతోన్మాదమైన బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. మతోన్మాదమైన బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. దేశంలో మతోన్మాద బీజేపీ నేటి సమాజానికి పట్టిన చీడపురుగని విమర్శించారు. బీజేపీ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందని విమర్శించారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాల రాస్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుండి ఎన్నికై ప్రజల అభివద్ధిని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పల్లె వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించి సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ..ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడించాలన్నారు. దేశంలో రెండవసారి అధికారలోకి వచ్చిన బీజేపీ రైౖతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను మతాల పేరుతో విద్వేషాలు పెంచుతూ మనుషుల మధ్య చీలికలు తెస్తుందని ఆరోపించారు. నిత్యవసర వస్తువులను అదుపు చేయడంలో విఫలమైందని అన్నారు. చేనేత వస్త్రాలపై జిఎస్టి విధించి సామాన్యులు బట్టలు కొనలేని దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. కార్మిక చట్టాలు మార్పులు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. స్వామీజీలను ముందు పెట్టి ఎమ్మెల్యేలను కొనాలని నీచ రాజకీయాలను చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొట్టు శివకుమార్, ముగుదాల వెంకటేశం, సీపీిఐ కార్యదర్శి నలుపురాజు సతీష్, మందడి నరసింహారెడ్డి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.