Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిగూడ మండలం దామర భీమనపల్లి, కమ్మగూడెం గ్రామలలో మునుగోడు ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలోమంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఒక మతోన్మాద పార్టీ అని అన్నదమ్ములాంటి హిందూ ముస్లింల మధ్య గొడవలు రేకెత్తిస్తుందని, అటువంటి పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే ఏకపక్షంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, ఎంపీటీసీ చిలువేరి విష్ణు, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు నడిమింటి శ్రీను, చాంద్‌పాషా, వనమాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.