Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైయినేజీలు, రోడ్లు శుభ్రం చేయడంతో కీలకం
- పని ఎక్కువ జీతం తక్కువ
- భారంగా మారిన కుటుంబ పోషణ
- జీపీ కార్మికుల ఆవదేన
నవతెలంగాణ-బొమ్మలరామరం
ఊరి జనం లేవక ముందే ..ఊరంతా శుభ్రం చేసి మేమంటే అందరికీ చులకనే.. రోడ్డు శుభ్రం లేకపోయినా.. డ్రైయినేజీలు మూసుకుపోయిన... తాగునీరు రాకపోయినా.. గుర్తుకు వచ్చేది మేమే. మా గురించి మాత్రం పట్టించుకునే నాధుడే లేడని, చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి.మండలంలో మొత్తం 135 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాల పరిశుభ్రత కోసం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న తమకు పనికి తగిన వేతనం చెల్లించలేక పోవడం కుటుంబ పోషణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేయడం, మొక్కలను నీరు పట్టడం, చివరికి పాఠశాల మరుగుదొడ్లు కూడా శుభ్రం చేస్తున్న ప్రభుత్వం తమకు కనీస వేతాలునాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించి ఇప్పుడు వాటి ఉసే ఎత్తడం లేదంటున్నారు. కరోనా సమయంలో తమ కుటంబాలను మరిచి, ప్రాణాలను లెక్కచేయకుండా గ్రామాల్లో పారిశుధ్య్ధ పనులు చేసిన ప్రభుత్వానికి తమపై కనికరం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు నిత్యవసర సరుకులు, వంట గ్యాస్ ధరలు, బస్, కరెంట్ చార్జీలు పెంచుతున్నారే కానీ మా జీతాలు మాత్రం పెంచడం లేదని, దీంతో కుటుంబ పోసిన భారంగా మారిందంటున్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి మాకు కనీస వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం
బొర్ర మల్లమ్మ.. గ్రామపంచాయతీ కార్మికురాలు
చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మాకు రోజురోజుకు పని పెరుగుతుంది కానీ వేతనాలు పెరగడం లేదు. ప్రతి గ్రామంలోనూ ఇంట్లో సంఖ్య పెరుగుతుంది. దీనితోడు సంతలు జరగడం వల్ల పని భారం పెరిగింది. తమ పనిని గమనించి వేతనాలు పెంచాలి.
పంచాయతీ కార్మికులు జీతాలు పెంచాలి
ర్యాకల శ్రీశైలం..
సీఐటీయూ మండల కన్వీనర్
గ్రామపంచాయతీ కార్మికులు లేకపోతే గ్రామాల శుభ్రంగా ఉండవు. ఎన్నో ఏండ్లగా జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వ వారికి కనీస వేతనం చెల్లించి, పీఆర్సీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.