Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
రైతులు పండించిన వరిధాన్యం క్వింటాకు రూ.3 వేలివ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్కె.యాకుబ్ డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెస్ భవన్లో పార్టీ మండల కమిటీ సమావేశం దోసపాటి భిక్షం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతుల ధాన్యం దళారులు పాలుకాకుండా అధికారుల సమక్షంలోనే కొనుగోలు చేయాలని కోరారు.బస్తాకు మట్టికింద కిలో తూకం కట్ చేసే విధానం రద్దు చేయాలని కోరారు.కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను ముంచేందుకు యత్నిస్తుందన్నారు.ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి పెద్దపీట వేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, ఫర్టిలైజర్స్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ఉచితంగా ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచమల్ల రామస్వామి. అంబటి భిక్షం, యనాల సోమయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, మహబూబ్ అలీ, మీసాల మట్టయ్య, బోల్లెపల్లి శ్రీనివాస్, నందిపాటి మట్టయ్య, దోసపాటి సుధాకర్,దోసపాటి భిక్షం తదితరులు పాల్గొన్నారు.