Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్ పోచంపల్లి
పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి గాంధీ విగ్రహం వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా బుధవారం మార్కండేయ దేవాలయం నుండి గాంధీ విగ్రహం వద్ద డివైడర్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచంపల్లి నుండి భువనగిరికి వెళ్లే చౌరాస్తా వద్ద 25 మీటర్ల దారిని వదిలి నిర్మాణం చేపట్టామని,అదేవిధంగా గాంధీ విగ్రహాన్ని ముందుకు జరిపి సర్కిల్ ఏర్పాటు చేసి అందులో వాటర్ ఫాల్ ను నిర్మించనున్నట్టు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు గుండు మధు,దేవరాయ కుమార్,కుడికాల అఖిల బలరాం మరియు తదితరులు పాల్గొన్నారు.