Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరి అవసరమని సంఘమిత్ర సేవాసమితి ఫౌండర్ చైర్మన్ బొట్ల సంపత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టల్ బీమా పాలసీని సంఘమిత్ర సభ్యులకు , జర్నలిస్టులకు అందజేశారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంఘమిత్ర సేవాసమితి స్వచ్ఛంద సంస్థ ఐదేండ్లుగా ప్రారంభించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు.పేద, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి కరోనా సమయంలో ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా కషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా మహమ్మారికి విలవల లాడిన నియోజకవర్గంలోని పేదలకు రెండు మాసాల మేరకు నిత్యావసర వస్తువులను సంఘమిత్ర తరపున అందజేసామని చెప్పారు. పేద మహిళల ఆర్థిక భరోసా కల్పించడానికి సుమారు 50 మంది మహిళలకు అధునాతన కుట్టుమిషన్లు ఉచితంగా అందజేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్గిడి బాలరాజు,ఇక్కిరి శ్రీను, కంతుల శంకర్,ఎగ్గిడి శ్రీను,బింగి భాను,మల్రెడ్డి నరసింహ రెడ్డి, కామిటికారి క్రిష్ణ,పంపరి లక్ష్మినారాయణ, వడ్డెమాన్ కిషన్,మార్ల సాయికుమార్, కట్కం నరేష్ పాల్గొన్నారు.