Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా న్యాయమూర్తి బాల భాస్కర్ రావు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సమితి అధ్యక్షులు బాల భాస్కర్ రావు న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో 'చట్టాలపై అవగాహన - చేరువలో న్యాయ సేవలు - ప్రజల సాధికారత' కోసం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అక్టోబర్ 31నుండి ఈ నెల13 వరకు అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల6న భువనగిరి మండలం అనంతారం గ్రామంలో జరిగే న్యాయ సేవా సదస్సు లో ప్రజలంతా పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు న్యాయమూర్తి మారుతీ దేవి, సబ్ కోర్టు న్యాయమూర్తి కోదండ దాశరథ రామయ్య, న్యాయమూర్తులు జి. కవిత, నాగేశ్వరరావు, న్యాయవాదులు ఎం రాజిరెడ్డి, పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేష్, శ్యాం , కె. మల్లేషం, శ్రీశైలం, మండల న్యాయ సేవా సమితి బాధ్యులు నర్సింహ రావు, రాంచందర్ పాల్గొన్నారు.