Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం
- రాజగోపాల్ రెడ్డి తన ప్రజాసేవలో విఫలం
- బీజేపీ మతోన్మాద రాజకీయాలను ప్రజలకు తెలియజేశారు
- వామపక్షాలు కష్టించి పనిచేస్తున్నాయి
- బీజేపీ ఓడిపోతామన్న నిరాశతో అలజడులు
- ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
- కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మోజర్టీతో గెలుస్తారు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
మునుగోడు లో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం అని తేలిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా సేవలో విఫలమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడని పేర్కొన్నారు. బుధవారం నవతెలంగాణతో ఆయన మాట్లాడారు.
వామపక్షల బలంతో కుసుకుంట్ల గెలుపు ఖాయం.
మునుగోడు నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న వామపక్షలు టీిఆర్ఎస్కు తోడవ్వడంతో గెలుపు ఖాయమైంది. నియోజకవర్గంలో బలమైన గ్రామాలు మొదట దిత్వియ స్థానాలతో పాటు గెలుపు ఓటరు నిర్దేశించే స్థాయిలో ఉన్నాయన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను ప్రజలకు వివరించడంలో సీపీఐ(ఎం) శ్రేణులు సఫలమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు, రాబోయే పరిస్థితులు ప్రజలకు వివరించి అప్రమతం చేశాం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై అవినీతి మచ్చ
రాజగోపాల్ రెడ్డి పై అవినీతి, స్వార్ధ రాజకీయాలు నడిపిన మచ్చ అతనిపై ఉందన్నారు. ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండకుండా కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే తన పదవిని అడ్డుపెట్టుకున్నారని తెలిపారు. కేంద్రస్థాయిలో మరిన్ని కాంట్రాక్టు కోసం బిజెపిలో చేరారని తెలిపారు
అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు.
రోడ్లు, విద్య, వైద్యం లాంటి సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరిన విషయం ప్రజలు మాకే వివరించి చెప్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో వివాదాలు.
బీజేపీ ఓడిపోతుందన్న రాష్ట్ర నాయకుల నైరశ్యంతో అలజడులు, వివాదాలు, దాడులకు ఉసిగోల్పతుంది. సామ, దాన, దండోపాయలను ప్రయోగించి గెలవాలని కుటిల ప్రయత్నాలు చేశారు. ప్రజాస్వామ్య పద్దతులు బీజేపీకి నచ్చవు. నియంత పాలనకే మోగ్గు చూపుతుంది. ఎలాగైనా గెలుపు దక్కించుకోవాలన్న ఉద్దేశ్యం తో ఓటుకు తులం బంగారం లేక ఇరవై వేలు ఇస్తామని ప్రచారం చేశారు. అయిన స్థానిక ప్రజలు బిజేపిని ఓడించాలనే నిర్ణయం తీసుకున్నారు.
వామపక్షల పనితీరు.
సీపీఐ(ఎం), సీపీఐ కార్యకర్తలు కంకణ బద్దులై వామపక్షలు బలపరించిన టీిఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేశారు.రాష్ట్ర, జిల్లా నాయకత్వ ఆదేశాలను తుచ్చ తప్పకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాటిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కారం మునుగోడు నియోజకవర్గం లోపలు సమస్యలుఅధ్యయనం చేశాం. వాటిలో సాగునీరు, రోడ్లు, విద్యా, వైద్య సమస్యలు ఉన్నాయన్నారు.వాటి ని పరిష్కారమయ్యేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాుం. అవసరమైతే పోరాటాలు తీవ్రతరం చేస్తాం. టీిఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తు గెలుపు కోసం టీిఆర్ఎస్ శ్రేణుల కంటే కొన్ని మండలల్లో, గ్రామాలలో వామపక్షల కార్యకర్తలు పనిచేశారు.
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోండి
మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయాలనే బీజేపీ కుట్రలు, కుతంత్రాలనుతిప్పికొట్టాలి.