Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరి రూరల్/యాదగిరిగుట్ట
విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామం ప్ర్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి, గంటన్నర సేపు విద్యారులతో గడిపారు. టీచ్ ఫర్ ఛేంజ్ విధానాన్ని, విద్యార్ధుల అభ్యసనా సామర్ధ్యాలను, ఉపాధ్యాయులు రూపొందించిన పాఠ్య ప్రణాళికలు, పీరియడ్ ప్రణాళికలను పరిశీలించారు. 4 వ, 5వ తరగతి విద్యార్థులు ఇంగ్లీషులో సాధించిన ప్రగతిని రాయించి, చదివించి తెలుసుకున్నారు. తెలుగు, గణితంలో బేసిక్ స్కిల్స్ పరిశీలించారు. విద్యార్ధుల్లో అభివద్ధి వుందని, ఇంకా ఇంప్రూవ్ చేయాలని, తెలుగులో పిల్లల అభ్యసన స్థాయి తక్కువగా వుందని, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మాతృభాషా బోధనలో అలసత్వం ఉండొద్దని, 80 శాతం కనీస సామర్థ్యాలు తప్పనిసరి సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, మండల అభివృద్ధి అధికారి ప్రభాకర్‌రెడ్డి, మండల విద్యా శాఖ అధికారి జె.కృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె.కమలాకర్, ఉపాధ్యాయులు జె.సారికాదేవి, యు వెంకట్, లావణ్య, లత, రాములు పాల్గొన్నారు.