Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీ ఏర్పడి నాలుగేండ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు మాట్లాడుతూ పాలకవర్గాన్ని ఎన్నుకుని మూడేళ్లవుతున్నా 8వ వార్డులో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మించలేదన్నారు. అంగడి బజారు నుంచి సుందరయ్య కాలనీ మీదుగా భువనగిరి మెయిన్ రోడ్డు వరకు సీసీ వేయాలని, 5వ వార్డు ఇందిరానగర్ లో ఎస్సీ జనాభా ఉన్నందున రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని, 11వ వార్డు అన్నెపు వాడలో బజారు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న మూడు విద్యుత్ స్తంభాలను తొలగించాలని డిమాండ్ చేశారు. 11వ వార్డు గాంధీనగర్ లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా సక్రమంగా చేయడం లేదని, రోజూ మంచినీటి సరఫరా చేయాలని, ఇందిరానగర్ లో వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప, బుజిలాపురం గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించి వనతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎర్రబెల్లి మల్లమ్మయాదయ్య, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, అవిశెట్టి రాజాలు, కస్తూరి వీరస్వామి, పసునూరి యాదయ్య, గడ్డం లక్ష్మయ్య, మెంట సురేష్, ఉయ్యాల అంజయ్య, పురుగుల యాదయ్య, బండారు ప్రశాంత్ రెడ్డి, కందుకూరి మురళి, అన్నెపు నర్సింహ, గడ్డం సోమనర్సయ్య, వంగరీ రాములు, కోలశ్రీనివాస్, అవిశెట్టి కిరణ్, బొమ్మగాని ఉప్పలయ్య, బందెల రవి, కొణతం రామనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.