Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
సైబర్ నేరాలపై విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని టౌన్ ఎస్సై నాగభూషణం పేర్కొన్నారు.బుధవారం పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహనా సదస్సులో పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు సెల్‌ఫోను పరిమితంగా ఉపయోగించాలని, మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు సైబర్ నేరగాళ్లు డ్రా చేస్తున్నా రన్నారు.ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలను నియంత్రించడంలో పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని కోరారు.సైబర్ క్రైమ్ కు గురైనప్పుడు1930 టోల్ ఫ్రీ అనే నెంబర్‌కు ఫోన్ చేయగలరని విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు మాదకద్రవ్యాలుగానీ, ర్యాగింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు వహిస్తూ క్రమశిక్షణతో సమాజంలో మెలగాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చారి, హెడ్‌కానిస్టేబుల్ హుస్సేన్‌గౌడ్, కానిస్టేబుల్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్, ఇన్చార్జి శివ, అధ్యాపకులు పాల్గొన్నారు.