Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
వృత్తి నైపుణ్య శిక్షణ పొందడం ద్వారా యువతకు స్వయంఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని సూర్యాపేట జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.రామారావునాయక్ అన్నారు. బుధ వారం కృషి విజ్ఞానకేంద్రం గడ్డిపల్లిలో మేనేజ్, సమేతి, ఆత్మ వారి ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఏడు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభంలో ఆయన మాట్లాడారు.ఈతరం యువత కేవలం ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా స్వయంఉపాధి పెంపొందించు కోవాలన్నారు.ఇతరులకు ఉపాధికల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ మాట్లాడుతూ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణలో మెళకువలు నేర్పడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలపై నెట్ వర్కింగ్ మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.ఉద్యానశాస్త్రవేత్త నరేశ్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో నర్సరీమొక్కల పెంపకం, పాటింగ్ మిక్చర్, వివిధ అంటు మొక్కల తయారీ వంటి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.చిరుధాన్యాల తయారీ ద్వారా మహిళలు తమ ఇంటి అవసరాలకు వాడుకొని మార్కెటింగ్ చేసుకొని లబ్ది పొందాలని గృహ విజ్ఞానశాస్త్రవేత్త ఎన్ సుగంధి తెలియ జేసారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ. కిరణ్, డి. నరేష్, టి.మాధురి, డి.ఆదర్శ్, నరేశ్, రైతులు వెంకన్న, అంజయ్య, కృష్ణ, వేణు, అశోక్, సునీత, శిరీష, కవిత, మౌనిక పాల్గొన్నారు.