Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్( సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.గోవర్ధన్ డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ జిల్లా రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేట్‌పరం చేయడానికి విద్యుత్ సవరణ చట్టం చేయడానికి పూనుకుంటుందని తెలిపారు.ఈ చట్టం వస్తే యావత్ విద్యుత్ రంగం కార్పొరేట్ శక్తుల గుప్తా పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్తుందన్నారు.ఫలితంగా రైతులకు వినియోగదారులకు పెనుభారాలు తప్పవని విమర్శించారు.విద్యుత్ అందని ద్రాక్షలాగా మారిందన్నారు.కేంద్ర పాలిత ప్రాంతాలలో అక్కడ ప్రయివేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడి ఉద్యోగులు రైతులు ప్రజలు వవీరోచితంగా పోరాడి వెనక్కు కొట్టారన్నారు.అదే స్ఫూర్తితో భవిష్యత్‌లో కార్మిక వర్గం పోరాడి ప్రయివేటీకరణబిల్లును తిప్పికొట్టాలని పిలుపనిచ్చారు.ఈ నెల 23 చలో ఢిల్లీకి విద్యుత్ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో కదలాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని ఆర్టిజన్ పీస్‌రేట్, మీటర్ రీడర్స్ తదితర కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, యూనియన్ జిల్లా కార్యదర్శి కె.వెంకటనారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, సత్యం, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.