Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆగ్రో ఇండిస్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఆగ్రో రైతు సేవాకేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవాలందాలని రాష్ట్ర ఆగ్రో ఇండిస్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ కె. రాములు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో డీఏఓ రామారావునాయక్, రివిజనల్ మేనేజర్ రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు.జిల్లాలోని 32 ఆగ్రో రైతు సేవాకేంద్రాల ద్వారా వచ్చే రబీలో ఎరువుల సరఫరా, విత్తనాలు, తెలంగాణ సిరిఎరువు అలాగే సస్య రక్షణ మందులు రైతులకు అందాలని సూచించారు.జిల్లాలో సమీకృత వ్యవసాయ ఉపకరణకేంద్రాలు నిర్మించుటకు భూ ప్రతిపాదనలు పంపాలని తెలిపారు.వచ్చే యాసంగి నుండి ఆగ్రో పేరుతో నాణ్యమైన పురుగుమందులు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, ఆగ్రో రైతుకేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.