Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 77.55శాతం పోలింగ్
- ఓటు హక్కును వినియోగించుకున్న 1,87,527 మంది
- రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, సీఐఎస్ఎఫ్ కమిషనర్ నందన్ పర్యవేక్షణ
- స్వల్ప సంఘటనలు
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్రంలో ఉత్కంఠ లేపిన మునుగోడు ఎన్నికలు చెదురు ముదురు సంఘటనలు మినహ ప్రశాంతంగా ముగిసాయి.నియోజకవర్గం లో 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,87527 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 77.55 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు 25.8 నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 9911 గంటలకు 25.8శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 99,700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 41.3 శాతం నమోదయింది. మధ్యాహ్నం 3 గంటలకు 1,44,878 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 59.92 శాతం నమోదు అయింది. సాయంత్రం ఐదు గంటలకు మొత్తం ఓటర్లలో 2,41805లో 1,87,527 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 77.55 శాతం అధికారులు ప్రకటించారు.
చెదురు ముదురు సంఘటనలు
మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు, చండూరు బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మద్య చౌట్టుప్పల్ మండలంలో బీజేపీ, పోలీస్ లమధ్య ఘర్షణలు జరిగాయి. పోలీస్లు అధికార టీఆర్ఎస్కు రూ.5లక్షలకు అమ్ముడు పోయారని నినాదాలు చేశారు. అయినా పోలీస్లు సమన్వయం పాటించారు. భువనగిరి డీసీపీ నారయణరెడ్డి అక్కడే ఉండి సమస్య పెద్దదికాకుండా చూశారు.
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పర్యటన
మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో సుడిగాలిగా పర్యటించారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీడియా ద్వారా కోరారు.సీఐఎస్ఎఫ్ కమిషనర్ నందన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సమస్యాత్మక గ్రామలకు సీిఐ స్థాయి అధికారిని బందోబస్తుకు నియమించారు.
శివారు గ్రామల్లో డబ్బుల పంపిణీ
ఎన్నికల గ్రామ లలో నేరుగా డబ్బుల పంపిణీ సాధ్యం కాక పోవడంతో ఆయ మండలాల శివారు ప్రాతంలో పోలింగ్ రోజు తిష్టవేసి యాథేచ్ఛగా డబ్బుల పంపీణి చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్టస్థాయి నాయకులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సూచనలు చేశారు. కొందరు ద్వితీయ స్థాయి నాయకులు డబ్బులు పంచకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. దీంతోఓటర్లు లబోదిబోమన్నారు.